ఈ వ్యాసాల విపులీకరణలో సాహిత్య చరిత్ర పురోగమన జాడలు చైతన్యవంతమై, మన చేయి పట్టుకొని నడిపిస్తూ చరిత్రను కళ్ళకు గట్టినట్లు చూపించే టూరిస్టు గైడులా సాగుతుంది సోమసుందర్ కలం. సుప్రసిద్ధుల, వర్తమానుల రచనలపై అయన గావించిన సమీక్షలు సమీక్షలుగా సాగుతూనే వారు చేసే సూచనలు, చూపే మెలకువలు రచయితలనే గాక పాఠకులకు కూడా పాఠ౦ చెప్పి, సాహితీజ్ఞానవంతుల్ని చేస్తాయి. సమీక్షల వీక్షణలో వెనుకో ముందో లేక మధ్యలోనో అలవోకగా పొంగివచ్చే చారిత్రక నేపధ్యాలూ, అనుభవం పండిన ఆలోచనా ధోరణి, ఉన్నత శిఖరారోహణ చేసి సహజ భావనా సౌందర్యంతో సందర్భశుద్ధిఅయిన హత్తుకొనే వాక్యరూపాలు దాల్చినాయి. ఈ వ్యాసాలు పసందైన సాహితీ పాయసాలు. మీముందున్నది వడ్డించిన విస్తరే. మీ ఆస్వాదనే ఆలస్యం. ప్రారంభించండి.........         - మేకా మన్మధరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good