ఆంధ్రోద్యమ సమీక్ష

నలభయి సంవత్సరాలుపైగా మన ఆంధ్రోద్యమం అచంచల సేవానిరతితో, అకుంఠిత విశ్వాసగరిమతో, అజేయసంకల్పబలంతో కొనసాగింది. మన మహానదులైన కృష్ణా, గోదావరీ స్రోతస్వినుల్లాగే ఒకప్పుడు ఝరీవేగంతో, మరొకప్పుడు మందకొడిగా అయినా ఎప్పుడు ఎక్కడా ఇంకిపోవడమనేది లేకుండా సజీవ ప్రవాహమై సాగుతూ వచ్చింది. ఒక మేలుకొన్న జాతిగా ఈనాడు ఇక్కడ మనం సమావేశమైనామంటే మన జాతీయ వికాసాన్ని బహుముఖాల విస్తరింపజేయడానికి వివిధ విభిన్నరంగాఇలలో మార్గదర్శిత్వం వహించిన మహామహులందరి యొక్క నిరవధిక నిర్విరామకృషి ఫలితమే! కందుకూరి వీరేశలింగం మొదలు అల్లూరి సీతారామరాజు దాకా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలు దామెర్ల రామారావు దాకా, బళ్ళారి రాఘవాచార్యులు మొదలు సురవరం ప్రతాపరెడ్డి దాకా, గిడుగు రామమూర్తి మొదలు పొట్టి శ్రీరాములు దాకా ఎందరెందరో మహామహులు తమకుతామే సాటిగా మన జాతీయ జీవితపు తీరుతీయాలను తీర్చిదిద్దడం వల్లనే ఈనాడు భారతదేశ చిత్రపటంలో మనకొక విశిష్టస్థానం లభ్యమయింది.

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good