ఈ సంపుటిలోని మొదటి ఆరు - కథలు పందొమ్మిది వందల నలభైలలో వెలువడినవే. చివరి మూడు కథలు మాత్రం పందొమ్మిది వందల డెబ్బైరెండులో వెలువడ్డాయి. ఈ సంపుటిలోని మొదటి ఆరు కథల్లో 1940 నాటి తెలంగాణ పల్లెటూర్లలోని ఫ్యూడల్‌ వ్యవస్థ స్వరూపాన్నే రచయిత అత్యంత వాస్తవికంగా చిత్రించాడు.

''మన ఊళ్ళోకూడానా?'' కథలో ఒక గ్రామంలో దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరాడాలని నిర్ణయించుకోవటం చిత్రించబడింది. ఈ తిరుగుబాటు మన ఊళ్ళో కూడా ప్రారంభమయ్యిందా! అని దొరమనుష్యులు కంగుతినటంతో ఈ కథ ముగుస్తుంది. రెండో కథ 'ఆకలి'లో పేద రైతు రామయ్య భూమిని ఆ ఊరి దొర దౌర్జన్యగా స్వాధీనం చేసుకోవడం చిత్రించబడింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా రామయ్య న్యాయస్థానానికి వెళ్ళినా అతనికి న్యాయం జరగలేదు - తను కేసు గెల్చినా ''మొకద్దమా'' ఖర్చులు రాలేదని దొర దిగులు పడ్తుంటాడని, ఎన్ని భూముల్ని ఇలా అక్రమంగా ఆక్రమించుకుంటున్నా - అతని ఆకలి తీరటంలేదని రచయిత ఈ కథను ముగించాడు.

'చెరువొడ్డున' అన్న కథలో చెరువులో కొద్ది నీళ్ళే ఉన్నా, అందులో మూడొంతుల నీళ్ళు దొరపొలానికే పారాలన్న 'రివాజు' ఆ ఊళ్ళో ఉంది. మూడొంతుల నీళ్ళు దొరపొలానికే వెళ్తే మిగతా రైతుల పొలాల గతేంకావాలని ఆ ఊరి రైతులు తిరగబడి తమ పొలాలకు కూడా నీళ్ళు పారేలా చేస్తారు. ''అందరికీ బాధ కల్గించిన 'రివాజు' హతమై రూపుమాసింది చెరువొడ్డున'' అన్న వాక్యంతో రచయిత ఈ కథను ముగించాడు. -అంపశయ్య నవీన్‌

పేజీలు :70

Write a review

Note: HTML is not translated!
Bad           Good