డా|| ఎం.హరికిషన్‌ రచించిన 40వ పుస్తకం 'కందనవోలు కథలు'.

    ఎటువంటి సంక్లిష్ట వస్తువునైనా కథగా మలిచే నేర్పు హరికిషన్‌ సొంతం. నిరాడంబరశైలితో ప్రవాహ వేగంతో, కథాగమనం ముక్కుసూటిగా కొనసాగుతుంది. అనవసరమైన వర్ణనలు, అసందర్భ సన్నివేశాలు ఏవీ వుండవు. అణచివేతకు గురైన సమస్త వర్గాల పట్ల అతని కథలు సహానుభూతిని కలిగి వుంటాయి. కానీ అది కథల్లో ఎక్కడా వాచ్యంగా కనబడదు. హరికిషన్‌కున్న ప్రజాస్వామిక దృక్పథంలోనూ, కథా శిల్పంలోనూ అది దాగి ఉండి రాయలసీమలోని కర్నూలు ప్రాంతపు జనజీవన వాస్తవ చిత్రాలను మన కళ్ళముందు ఆవిష్కరిస్తుంది.

    దాదాపుగా ఇందులోని కథలన్నీ, ప్రాంతీయ స్పృహతో గుబాళిస్తూ ఉంటాయి. దేశంలో ఎక్కడైనా ఈ కథల్లోని జీవితం కన్పిస్తూండవచ్చు గానీ, ఇది నిర్దిష్ట ప్రాంతపు ప్రాదేశిక జీవితం వాతావరణం, భాష, మాటతీరు మనుషుల ప్రవర్తన, ఆర్థిక పరిస్థితులు, మత కుల వర్గ, స్పృహ, మహిళల కుటుంబగత హింస ఇలాంటివెన్నో ఈ కథల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తూ, ప్రాంతీయమైన రంగూ, రుచీ, వాసనలను వెదజల్లుతాయి.

    రాయలసీమలోని కర్నూలు ప్రాంతపు ఆధిపత్యపు కులాల ఫ్యూడల్‌ అహంకారం, ఫ్యాక్షన్‌, కరువు పరిస్థితులు, వ్యవసాయం, పేదరికం ఇలాంటివన్నీ కూడా స్థానిక రచయిత రాయటం వల్ల ఈ కథల్లో ప్రాణం పోసుకున్నాయి. ఇందులో కనిపించే 'స్థానికత' ఒక విలక్షణత్వాన్ని ఈ కథలకు ఆపాదించింది. - సింగమనేని నారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good