సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత.

మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామాజిక చైతన్యం కలిగిస్తాయి.

అపారమైన భావనాశక్తి, విశేషమైన భౄషా వైదుష్యం కలిగిన రచయిత సదానంద. మానవనీయత, సామ్యవాద నిబద్ధతల సమన్వయ సమాహారమే ఈ కథానిక సంపుటి.

ఈ కథా సంపుటిలో ఇస్‌ ఝండేకే నీచే, మాలా - మనిషి, పట్టెడు మెతుకులు, అభయం, గాంధీదర్శన్‌, అద్భుత దీపం, బంగారు పిడకలు, నవ యువకుడు, స్థితి, అక్షర సత్యాలు అనే 10 కథలు ఉన్నాయి.

పేజీలు : 110

Write a review

Note: HTML is not translated!
Bad           Good