కళ్ళు తెరిచిన సీత (యదార్థ గాథ) - రంగనాయకమ్మ

''కళ్ళు తెరిచిన సీత'' (యదార్థగాథ)కు ముందుమాటగా రచయిత్రి రంగనాయకమ్మగారు
'ఇది 'కథ' కాదు
'నవల' కాదు
'కవిత' కాదు
'వ్యాసం' కాదు
'వార్త' కాదు
'ఆత్మకథ' కాదు
ఇది వాటిల్లో ఏ కోవలోకీ చేరదు.
మరి ఇది ఏమిటి అవుతుందో ఇప్పుడు చెప్పలేను. దీనికి ఏం పేరు వస్తుందో తేలితే చివరికి తేలాలి. ఇది ఒక అమ్మాయి జీవితంలో కొంత భాగం. పెళ్ళీ. పెటాకులూ అయిన భాగం. ఇందులో, ఒక్క సంఘటన అయినా కల్పన లేదు. పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్లూ. ఈ నిజ జీవితంలో కల్పనలూ, ఊహాగానాలూ కట్టు కథలూ, కలపలేదు. ఇవి నిజ జీవిత సంఘటనలు! జరిగింది జరిగినట్టు రాతలో పెట్టడమే నేను చేశాను. రాతలో పెట్టడంలో నా పద్ధతి నాది. ఇది, ఆ అమ్మాయికి తెలియకుండా రాసింది కాదు. ఆ అమ్మాయి చెప్పగా తెలుసుకుని, ఆమె ఇష్టంతో, ఆమె ఇచ్చిన కాయితాల ఆధారంగా రాసిందే. ఇందులో కొన్ని పేర్లు నిజం పేర్లే కొన్ని పేర్లు మారు పేర్లు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good