ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడి సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత వ్యక్తి...మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒకటేనంటారు! ఈ విషయాలే 'కలకండ పలుకులు'గా ఇప్పుడీ పుస్తకం మీ ముందు ఉంది. ఈ పలుకుల్లోని అర్థాన్నీ, పరమార్థాన్నీ తెలుసుకోవాలంటే ఇది చదివితీరాలి. చక్కని భాష, చల్లని మాట, గుండె ఝల్లనిపించే కథాకథనం ఈ పలుకుల ప్రత్యేకత! ప్రతీ పదంలోనూ నిజాయితీ ఉంది. ప్రతీ వాక్యంలోనూ పవిత్రత ఉంది. నమ్మింది నమ్మినట్టుగా రాశారు ఓలేటి శ్రీనివాసభాను. అందుకు వారు అభినందనీయులు. - ఎ.ఎన్‌.జగన్నాథశర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good