ఇవి బారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కథలు.

తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం.

ఒక్కొక్క కథ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కథానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది.

భారతదేశపు ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల కథలను కళారంగంలో ప్రతిభామూర్తులు పేరిట అందించారు. అద్వితీయ ప్రతిభ, సృజనాత్మకతతో దేశ విదేశాలలో ప్రసిద్ధిగాంచిన ఈ కళామూర్తులు కళారంగంలోకి అడుగిడేందుకు నవతరానికి స్ఫూర్తినిచ్చారు.

పేదరికం నుంచి ప్రపంచ చిత్రకళా యవనిక మీదకు ఎదిగిన భారతీయ కళామూర్తి ఎమ్‌.ఎఫ్‌.హుసేన్‌

ప్రపంచ రంగస్థలంపై కర్ణాటక సంగీత పతాకం ఎగురవేసిన భారత గాన కోకిల ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి

హిందీ సినీ సంగీతానికి మారు పేరుగా నిలచిన మధుర గాయని లతామంగేష్కర్‌

కథక్‌ నాట్యాచార్యుడు పండిట్‌ బిర్జుమహారాజ్‌

భరతనాట్య కళ అధ్యయనానికి, సాధనకు, బోధనకు జీవితాన్ని అంకిత చేసిన విదుషీమణి డాక్టర్‌ పద్మా సుబ్రహ్మణ్యం.

శాస్త్రీయ సంగీతానికి అధునాతన బాణీలను మేళవించి సరోద్‌ సౌధ శిఖరాలు అధిరోహించిన ఉస్తాద్‌ అంజాద్‌ అలీఖాన్‌

దక్షిణ భారతీయ శిల్పకళా సంప్రదాయాలను ఆధునిక కళాప్రక్రియతో మేళవించి ఉక్కువంటి లోహాలను మైనపు ముద్దలుగా మలచి బృహత్‌ శిల్పాలు సృష్టించిన శిల్పి ఎస్‌.నందగోపాల్‌

వయోలిన్‌ విద్వాంసుడు మిశ్ర సంగీత స్వర రచయిత డాక్టర్‌ ఎల్‌.సుబ్రహమణ్యం

తబలా వాద్య ప్రాభవాన్ని ప్రపంచ పరిధికి విస్తరింపజేసిన విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌

భారతీయ సినీ సంగీతపు రూపురేఖలు మార్చిన ఎ.ఆర్‌.రెహమాన్‌

దృఢ దీక్షతో అంకితభావంతో అన్ని అవరోధాలను అధిగమించి కళారంగాన్ని పరిపుష్టంచేసిన ప్రతిభామూర్తుల కథలివి.

pages : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good