Rs.25.00
In Stock
-
+
''గబ్బిలాని'' కీ ''కాకి'' కీ గంగానదికీ పిల్లకాలవకీ ఉన్నంత
అంతరం ఉన్నప్పటికీ, దానికీ దీనికీ పోలిక చెప్పడం సహజమే.
అది ఒక నిర్భాగ్యుడు గబ్బిలానికి చెప్పుకున్న సొద.
ఇది అచ్చంగా కాకి స్వగతం.
అల్ప సంఖ్యాకులు జాతి సంపదపై, సాంస్కృతిక, సామాజిక,
సారస్వత వారసత్వాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ
వస్తున్న ఈ దేశంలో,
''కాకి'' ఒక కాకి గోల.
ఇప్పుడో, ఎప్పుడో అందరూ పట్టించుకోవలసిన గోల.
ఇది డప్పు శబ్దంగా డమరుక నాదంగా దిక్కులు
పిక్కటిల్లేలా వ్యాపించి సమన్యాయం దిశగా
జాతిని అడుగులు వేయించే ఒక కాకి గోల.
కాకికీ ఉంది ఓ స్వగతం. కాకి గుండెలోనూ ఉందొక ఆర్తి.
దీన్ని చదవడానిక్కూడా ''ఆర్థ్ర హృదయం'' కొంత అవసరం.
ఆ ఆక్రోశానికి అక్షర రూపం ఈ కాకి.
పేజీలు : 32