క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అక్కడ అందరినీ ముస్లిం మతంలోనికి మార్చడం జరిగింది.

యుగంధర్‌ని ముస్లిం మతంలోకి మార్చి ''మాలిక్‌ మక్బూల్‌'' అని పేరు మార్చారు. తరువాత ముల్తాన్‌ ప్రాంత గవర్నర్‌గాను, ఢిల్లీ ఉపప్రధానిగాను నియమిస్తారు. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ కాలంలో అత్యున్నత ప్రధాని పదవిని అలంకరించి, ఢిల్లీ సుల్తనేట్‌లో కీలక భూమిక పోషించడం జరిగింది. యుగంధర్‌ అక్కడ కాకతీయుల కాలం నాటి దశబంధ విధానాన్ని, నాయంకర వ్యవస్థను, వుద్యానవనాల అభివృద్ధిని చేపట్టి, పరిపానలో నూతన ఒరవడిని సృష్టించి ఫిరోజ్‌ షా మన్ననలు పొందడం జరిగింది.

షుమారు 45 ఏళ్ళు ఢిల్లీ సుల్తాన్‌ల దగ్గర వివిధ హోదాలను అనుభవించి ఎన్నో చారిత్రక కట్టడాలకు మార్గదర్శకులయ్యారు. ఢిల్లీ సుల్తాన్‌ కాలం నాటి పారశీక, అరబిక్‌ మూల గ్రంథాల ఆంగ్ల అనువాదం ఆధారంగా రాసిన ఈ గ్రంథం యుగంధర్‌పై తొలి ప్రామాణిక గ్రంథం. - స్టీఫెన్‌ డేవిడ్‌ కురగంటి

పేజీలు : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good