1950వ సంవత్సరం నాటి కోన్`టికీ సముద్రయాన కథలో పూర్వ కాలం నాటి పాలినేషియన్ సంస్కృతి మనకు గోచరమవుతున్నది. జన్మత: నార్వే దేశానికి చెందిన థార్ హెయర్డ్ హాల్ ప్రకృతి శాస్త్రాభిమాని. ఇతర పాలినేషయన్ల వలస విధానాన్ని మన దృష్టి పథానికి తెచ్చి అది ఒక సజీవ సత్యంగా నిరూపించాడు. భౌతిక శాస్త్రజ్ఞుడు కావటం చేత తాను చెప్పదలచుకునన్న దానిని విశదంగా తెలియబరచాడు. తన సిద్ధాంతాన్ని ఋజువు పరచటం కోసం, సహచరులైదుగురినీ ప్రోత్సహించి యాత్ర సాగించాడు. ఈ మహా కార్యం అతన్ని చిరస్మరణీయుడుగా చేస్తున్నది. ఈ యువకుల సాహసం వల్ల చరిత్రకారులకూ, భూగర్భ శాస్త్రజ్ఞులకూ అయోమయంగా కనబడుతున్న ఒక అద్భుత సమస్య సుపరిష్కృతమైనది. థార్ హెయర్డ్హాల్ మేకులు ఉపయోగించకుండా ఇంకాన్ జాతి వారి ప్రాచీన పద్ధతిని తోమ్మిది బాల్సా దుంగల తెప్పను నిర్మించి, దానినే సముద్రతరణ సాధనంగా చేసి, దానికి ఇంకాన్ జాతిలో ప్రాచీనుడైన కోన్`టికీ పేరు పెట్టాడు.
ఈ యువకుల ఉతÊఆసహశక్తికి అడుగడుగునా పరీక్షలు జరిగాయి. మనుష్యులను తినటానికి అలవాటుపడ్డ సొరచేపలతో కలిసిమెలసి ఉండవలసిన పరిస్థితులున్నూ కలిగాయి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఈ మిత్రమండలి స్థైర్యం చెక్కుచెదరకపోవటం, ఎంత విపత్తునైనా వినోదప్రాయంగా చూడటం ఎవరికైనా ఆశ్యర్యం కలిగించే పరమసత్యాలు. వీటి వల్ల ఈ కోన్`టికీ యాత్ర ఒక అద్భుత గాథ అయ్యింది.
పేజీలు : 168