శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతివేంకటకవులలో ఒకరు.

షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని తయారయిన కవులకు, అవధానులకు లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగులేని చిరయశస్సు ఆర్జించారు. వీరి అవధానశక్తి అత్యంత విలక్షణం. ధారాశుద్ధితో కూడిన ధారణశక్తి, ఆశుధారాపటిమ ఆజన్మసిద్ధమా అనిపిస్తుంది. అవధానమనే యాగాశ్వంతో దిగ్విజయ యాత్ర సలిపి కవితా సామ్రాజ్య పట్టాభిషిక్తులయ్యారు. పద్యమైనా, వచనమైనా కరుబుర్లైనా చవులూరించేటట్లు రాయగలరు; చెప్పగలరు.

శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 18 యేండ్ల వయసులో శ్రీ కాశీ మహాక్షేత్రానికి వ్యాకరణాధ్యయనం కొరకు వెళ్లి ఆ అనుభవాలను రాశారు. అదే కాశీయాత్ర. కాశీ గురించి చెప్పాలంటే అది భారతీయ ఆత్మ. ప్రాచీన సంప్రదాయ విద్యలకూ అప్పుడూ, ఇప్పుడూ అధ్యయన అధ్యాపన కేంద్రం.

చెళ్లపిళ్లవారు చెప్పిన కథలు - గాథలులో చేరని మరి నాలుగు రచనలు కూడా కలిపి ఈ తరానికి అర్థం కావడానికి చక్కటి పాద సూచికలతో, అలనాటి ఛాయాచిత్రాలతో, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరమణ ముందుమాటలతో ఈ కాశీయాత్ర పొత్తాన్ని ప్రచురించాము.

పేజీలు : 151

Write a review

Note: HTML is not translated!
Bad           Good