కళ్ళెదుట జరుగుతున్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, అమానవీయ సంఘటనలనూ చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు సీ.వీ.ది. అందేకాదు చూస్తూ ఊరుకునే వారినీ వొదిలిపెట్టే రకమూ కాదు. మూఢ విశ్వాసాలను, భావవాదపు తిరోగమన అసత్య తతంగాలను, తంతులను, వాదాల్ని తన పదునైన అక్షరాలతో కడిగిపారేస్తాడు. మనముందు నిలువెత్తు నిలబెట్టి కవితా ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అంతటి ఆవేశం తన రచనలో వుంటుంది. అవును! ఆవేశం లేకుండా మనిషెలా అవుతాడు!
1965లో రాసిన కవితలు ఇందులో వున్నాయి. అంటే యాభైయేళ్ళ క్రింద మన సమాజంలో వున్న భావదాస్యాన్ని తూర్పారబట్టిన ఖండికలివి. ఇప్పుడు వీటికి అంతటి ప్రాసంగికత వుంటుందో అని అనుకోవచ్చు పాఠకులు. నేనూ అనుకున్నాను. కానీ మరింత పెరిగిందని అనిపించింది. సి.వి. ఏ కంపునీ, దుష్టత్వాన్ని అహేతుకతనీ, అమానవీయతను, హిపోక్రసినీ చూసి చలించి చెండాడిందో అంతకంటే కంపూ, దుష్టత్వం, దుర్మార్గం, అమానవీయత పెరిగిన నేటి సందర్భంలో కారు చీకట్లో కాంతి రేఖ మళ్ళీ మళ్ళీ ముద్రించాల్సే వుంటుంది. నేటి యువతతో చదివించాల్సే వుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good