మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు

హితము గూర్పవలయు నెల్లరకును

హితము గూర్చలేని మతము మానగవలె

         కాళికాంబ ! హంస ! కాళికాంబ!

వెలదులకును వేదవిద్యాధికారమ్ము

లేదంటచు, బ్రహ్మలిఖితమంచు

నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను

కాళికాంబ ! హంస ! కాళికాంబ!

సర్వమానవులను సమముగా ప్రేమించు

కులమతాలనెంచి కోపపడకు

కాపుజాతినెల్ల కరుణించుమనె శ్రుతుల్‌

కాళికాంబ ! హంస ! కాళికాంబ!

తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిగాగ

బాటనడ్డు శత్రుకోటి గొట్టి

వరకవీశు డచలబ్రహ్మమ్ము తానౌను

కాళికాంబ ! హంస ! కాళికాంబ!

పేజీలు : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good