సమాజం పట్ల బాధ్యతగల రచయిత లెప్పుడూ ఉత్తమ సాహిత్యాన్నే వెలువరిస్తారు. బి.ఎస్.రాములు పేరు విన్నప్పుడు అటువంటి ప్రయోజనాత్మక రచనలే గుర్తుకు వస్తాయి. ‘కాలం తెచ్చిన మార్పు’ పేరున ఆయన విడుదల చేసిన కథల సంపుటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయదు. ప్రతి కథా ముగింపులో పాఠకులను ఆలోచింపజేస్తుంది.
‘జీవితం పట్ల ప్రేమను మొలకెత్తింపజేసి, సామాన్యులను విజేతల్ని చేయడమే సాహితీవేత్తల కర్తవ్యం. అప్పుడే వారు సామాజిక తత్వవేత్తలుగా తమ బాధ్యతను నెరవేర్చిన వారవుతారు’ (‘ముందుమాట’) అని ప్రగాఢంగా నమ్మిన బి.ఎస్. తన రచనలన్నిటా ఇదే దృక్పథాన్ని అవలంభిస్తున్నారనడానికి ఈ కథలే ఒక నిదర్శనం. సీనియర్ కథకులు కలం పడితే ఎంతటి వస్తు వైవిధ్యం ప్రతిఫలిస్తుంది? అన్న దానిని ఈ కథలు చక్కగా నిరూపించాయి ‘లక్ష్మమ్మ గెలుపు రహస్యం’ నుంచి ‘జిజ్ఞాస’ వరకు మొత్తం (16) కథల్లో అన్నీ వాస్తవికతే ప్రాతిపదికగా ఉన్నాయి. 1978 తర్వాతి పరిస్థితుల నుంచి నేటి మన స్వరాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యం దాకా విలక్షణమైన ఆయా కథా వస్తువుల ఎంపికలోనే రచయిత సామాజిక తాత్వికత స్పష్టమవుతుంది. ‘కుమ్మరి గూనలు’, ‘ఊర్పులు సర్దిన’, ‘మునుపటి తీరుగ’, ‘మసుకులనే నిద్ర లేపి’ (కాలం తెచ్చిన మార్పు- పే:36), ‘బోల్లు తోమడం’ (అసమర్థుని జీవయావూత-పే:125) వంటి తెలంగాణ పదాలు ఎన్నో దర్శనమిస్తాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good