ఫీలయ్యేవాళ్ళకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించే వాళ్ళకి కామెడీ.
శ్రీమతి బలభ్దపాత్రుని రమణి ఈ రెంటి కలయిక. ఫీలైనది కథలుగా, నవలలుగా రాస్తే, ఆలోచించే వాటిని కౌముది డాట్‌ నెట్‌లో 'కాలమ్‌ దాటని కబుర్లు'గా చాలా ఏళ్ళుగా రాస్తున్నారు. దానికి గల టేగ్‌లైన్‌, 'నెలనెలకీ కొన్ని కులాసా కులాసా కబుర్లు' చక్కగా సరిపోతుంది.
తెలుగులో కామెడీ రాసేవారు తక్కువ. శ్రీ పురాణం సుబ్రమణ్య శర్మ (ఇల్లాలి ముచ్చట్లు) శ్రీ ఆదివిష్ను (సరిగమలు), శ్రీ ఎర్రంశెట్టి సాయి (చాలా శీర్షికలు), ముళ్ళపూడి వెంకట రమణ (ఏదైనా) మొదలైన రచయితలే కామెడీని రాసారు. తెలుగు రచయిత్రులలో హాస్యంలో తక్కువేమో అభిరుచి అనుకుంటాను. వారిలో కామెడీ రాసేవారు చాలా తక్కువ. భూతద్దంలో వెదికితే నాకు ముగ్గురు రచయిత్రలే కనిపించారు. శ్రీయుతులు భానుమతీ రామకృష్ణ, పొత్తూరి విజయలక్ష్మీ, ఇప్పుడీ బలభద్రపాత్రుని రమణి, కౌముదిలో నేను మొదటగా చదివే శీర్షిక ఇదే.
కామెడీ కథో, నవలో రాయడం కన్నా కాలమ్‌ రాయడం కష్టమైన పని. ఈ పుస్తకంలోని కబుర్లు చదివితే ఎవరికైనా తెలుస్తుంది.
'ఆ ఇద్దరూ' 'కాలమ్‌'లో సినిమాలకి వచ్చిన విశ్వనాథ సత్యనారాయణ, కొమ్మూరి సాంబశివరావు, వీరేంద్రనాథ్‌ల స్వగతాలు ఆమెలో హాస్య ప్రియత్వాన్నే కాక పరిశీలనా శక్తిని కూడా సూచిస్తాయి.
షష్టిపూర్తి వ్యాసం (60వ గల్పిక) 'జాగ్రత్త...జాగ్రత్త...జాగ్రత్త!' ఆవిడలోని హాస్య ప్రియత్వానికి మరీ మచ్చుతునక. టేంక్‌బండ్‌లోని విగ్రహాల మీద చక్కటి చనుకులు ఉన్నాయి. ఈయనెవరు? - పొట్టి శ్రీరాములు - బాగా పొడగరే! లాంటివి. మనలోని సాంఘీక, సామాజిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ఇందులో లైటర్‌ వేన్‌లో చెప్పారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good