Rs.100.00
Out Of Stock
-
+
ఇది వ్యాసాల సంకలనం. ఇందులో పదమూడు వ్యాసాలూ ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమూల్య రచనలివి. సైన్స్ వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయి అనుకుంటున్నారేమో ! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సొగసుంది. హాస్యం ఉంది. కనీకనిపించకుండా వ్యంగ్యం ఉంది. అన్నిటిని మించి అన్వేషణ ఉంది.
సైన్సు వాస్తవం సైన్సు కథలకంటే ఉత్తేజకరంగా ఉంటుందని హాకింగ్ రుజువు చేస్తాడు. అసంఖ్యాకమైన పిల్ల విశ్వాల గురించి చెప్పి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. ఈ చరాచర జగత్తుకి మనమే ప్రభువులమా? ఎన్నటికీ దేనినీ తెలుసుకోలేని నిరర్ధక జీవులమా? మనం చెయ్యలేని దాని గురించి వగచేకంటే సాహసించడమే మేలు. అన్వేషణ మన లక్ష్యం అంటాడు హాకింగ్.