పశుపక్ష్యాదులు ప్రధాన పాత్రలుగా, నీతిబోధకంగా వుండే కథలు పిల్లలకు ఎంతో ఆసక్తిదాయకంగా వుంటాయి. పిల్లల్ని అలరిస్తాయి. మనసుల్ని గాఢంగా హత్తుకుంటాయి. అందుకు కారణం బహుశ జంతుజాలం పట్ల పిల్లలకు వుండే ప్రేమాభిమానాలు కావచ్చు. అందుకే పంచతంత్రంలాంటి కథలు కాలగర్భంలో కలసిపోకుండా సజీవంగా నిలిచిపోయాయి. కాకి ప్రధాన పాత్రగా చెప్పబడిన కొన్ని నీతికథలు ఒకచోటకు చేర్చి 'కాకమ్మ కథలు'గా చెప్పాలని రచయిత ఆకెళ్ళ శివప్రసాద్‌ ఈ రచనను సాగించారు. ఈ కథలు పిల్లల్ని, పెద్దల్ని ఆనందింపజేస్తాయి. -

వల్లూరు శివప్రసాద్‌

ప్రధాన కార్యదర్శి

ఆంద్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం

Write a review

Note: HTML is not translated!
Bad           Good