ఒక మనిషి బ్రతకడానికి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో - ఆ మనిషి ఆనందంగా, సంతోషంగా, హుషారుగా బ్రతకడానికి నవ్వు అంతే అవసరం. - నవ్వు లేని జీవితం నిర్జీవం, నిస్సారం అని నా ఉద్దేశ్యమే కాదు - నిజం కూడ.
మిత్రులు డా.ఎన్‌.వి.కె.ప్రసాద్‌ గారు రచించిన 'కాదేదీ కామెడీ కనర్హం' అనే లఘునాటికల సంపుటిని ఆసాంతం మూడుసార్లు చదివాను. మూడోసారి కూడా మొదటిసారిలాగానే విరగబడి నాలో నేనే నవ్వుకున్నాను. సునిశితమైన హాస్యం, గిలిగింతలు పెట్టే ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన శైలి, ఆటవిరుపు డాక్టరు గారికి వాళ్ళమ్మ గారు చిన్ననాటి వెన్నముద్దలతో మింగించారు.
నవ్వించాలని నవ్వించరు. హాస్యం పుట్టాలని వ్రాయరు. నిజం చెప్పాలంటే డాక్టరు గారు కొంచెం సీరియస్‌గానే ఉంటారు. కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన ఛలోక్తులకు నవ్వుతూనే ఉంటారు. అది భగవత్‌ ప్రసాదితమైన ఓ కళ. పుట్టుకతోనే వస్తుంది. - జె.పి. - జయప్రకాష్‌ రెడ్డి
హాస్యం ఎన్నో రకాలు. మునిమాణిక్యం నుంచి ముళ్ళపూడి దాక. ఇటీవల హాస్యం, కథలు ముఖ్యంగా నాకు రుచించడం లేదు, కారణం?
షాంపైన లాగ బుసబుసలాడవల సింధు భైరవిలాగ మ్రోగుతున్నది కనుక. ప్రేయసిలాగ గుసగుసలాడక గయ్యాళిలాగ గోల చేస్తున్నది కనుక.
అలా కాక డా|| ప్రసాద్‌ నాటికలు, ఏదానికది నిజ జీవితానికి, అందంగా తగు మాత్రపు అతిశయోక్తితో అద్దం పడుతున్నది, చాటెడుపు లిహారకు చిటికెడు ఇంగువ లాగ. వాటి మరొక సువాసన చదువుకోడానికి బాగున్నవి. ఇక లలితంగా రంగమెక్కిస్తే ఇంకెంతగా ఉంటవో చూడాలనిపిస్తున్నది, ఎప్పుడో మరి. - వి.ఎ.కె.రంగారావు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good