దాదాపు మూడు దశాబ్దాలుగా కథలు వ్రాస్తూ అయిదు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి వెలువరించిన వరలక్ష్మి పది కథల బంగారం ఈ పుస్తకం.

వరలక్ష్మి కథలు ఎక్కువగా స్త్రీ కేంద్రకంగా వుంటాయి. అవికూడా మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి విద్యావంతులైన స్త్రీలు కాక సమాజపు అడుగు పొరలలో వుండి, జీవితంతో పోరాడుతున్న స్త్రీలు. వాళ్ల జీవితం అనుక్షణ పోరాటం. ఆమె ఎంచుకున్న ఇతివృత్తాలకు తగిన నేపథ్యం, భాష చాలా సహజంగా వుండేలా తీర్చిదిద్దుతారు. చిన్న చిన్న వివరాలను కూడా శ్రద్ధగా నగిషీలు పెడతారు.

అట్టడుగు స్తాయి వర్గాలను మధ్యతరగతి జీవన పరిస్థితులను పరిశీలనా దృష్టితో చూడడం రచయిత్రిగా మె ప్రత్యేకత. ఆమె కథలన్నీ చదివింప జేస్తాయి. ఆలోచింప జేస్తాయి. ఆర్థ్రతగా ఉంటాయి. గుండె తలుపులను తడతాయి. చాలా కథలు, కవితలు వివిధ సంకలనాలలో చోటు చేసుకోవటం ఆమె ప్రతిభకు నిదర్శనం.

ఈ కథా సంపుటిలో శివంగి, సహచరి, మంత్రసాని, ప్రత్యామ్నాయాలు, ఆనకట్ట, ప్రస్థానం, పిండి బొమ్మలు, స్వస్తి, మట్టి - బంగారం, ఖాళీ సంచులు అనే 10 కథలు ఉన్నాయి.

పేజీలు : 110

Write a review

Note: HTML is not translated!
Bad           Good