జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానాన్ని సుస్థిరం చేస్తూ కె.వి.ఆర్‌. రాసిన ఉద్గ్రంధం 'మహోదయం' 1969లో వెలువడింది. దీనికి ముందే దువ్వూరి రామిరెడ్డి జీవిత సాహిత్యాలపై 'కవికోకిల' గ్రంథాన్ని వెలువరించారు. ఆ సమయంలోనే శరచ్చంద్ర ఛటర్జీపై సంక్షిప్తంగా రాసిన జీవిత కథ వచ్చింది.  1970లో శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యాన్ని ఆరు సంపుటాలుగా వెలువరించినపుడు, వాటికి విపులమైన పీఠికలు రాసి సంపాదకత్వం వహించాడు.  రవీంద్రుడు, శరత్‌ మొదలు గురజాడ, దువ్వూరి రామిరెడ్డి వరకు ఆయన స్పృశించని సాహిత్య వ్యక్తిత్వాలు లేవు.  యాదగిరి, సుద్దాల హనుమంతు, గరిమెళ్ళ మొదలు గద్దర్‌, వంగపండుల వరకు ఆయన విశ్లేషించని వాగ్గేయ కారులు లేరు.750 పేజీలకు పైగా ఉన్న ఈ గ్రంథంలో కళా సాహిత్య, రాజకీయ, చరిత్ర, సంస్కృతి, విద్య, సామాజిక రంగాలపై కె.వి.ఆర్‌. రచించిన పలు వ్యాసాలు పొందుపరచబడ్డాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good