రాజకీయ, న్యాయ, పాలనాయంత్రాంగాలు అవినీతి మయమైనప్పుడు, చివరకు ఫోర్త్‌ ఎస్టేట్‌ అయిన ప్రసార మాధ్యమాలు కూడా ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కినప్పుడు నిజాయితీపరుడైన ఒక విలేఖరి వ్యథను మృత్యుంజయుడు కథలో సభా చిత్రించారు. బీరప్పలాంటి విలేఖరులకు చివరికి శ్రీముఖాలే అందుతాయనే సత్యాన్ని చెప్పారు. మరోపక్క అసత్యాల్ని, అతిశయోక్తుల్ని ఆధారం చేసుకొని రాసే కల్లబొల్లి వార్తలకు, ఎక్కువవుతున్న ప్రచారం, పెరిగిపోతున్న ఎల్లో జర్నలిజం వికృతరూపాన్ని కూడా ఈ కథలో ఆయన ఎండగట్టారు. సభా జరుగుతున్న పరిణామాలను ఒక రచయితగా, పత్రికా రచయితగా ఎంత ముందు చూపుతో గమనించారో మృత్యుంజయుడు కథ ద్వారా తెలుస్తుంది.
'నీటిదీపాలు'లో ప్రముఖ వ్యక్తి ఊరి లైన్‌మెన్‌, 'బూరగపండు'లోని డబ్బున్న వాడిదే గెలుపు అనే ముందుచూపున్న బసప్ప లాంటి వాళ్ళు డెబ్బయ్యవ దశకం తర్వాత ఎంత ఎత్తెత్తులకు వెళ్ళారో సభా కథలు ఆలోచింప చేస్తాయి. ఒక మాటాలో చెప్పాలంటే స్వాతంత్య్రానికి ముందు తరానికి చెందిన అంతరంగ ఘర్షణ ఆవిష్కరణే కె.సభా కథలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good