శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి. డి. కోశాంబి ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్ రాసిన విలువైన పుస్తకమిది.

ఆదిమ కాలం నుంచి భూస్వామ్య దశ వరకు ప్రాచీన భారత చరిత్ర గురించి కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. శాస్త్రీయంగా భారత దేశ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదలచుకున్న వారు ఎవరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు.

కోశాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని చదివే తను మార్క్సిస్టునయ్యాననీ; ఆ రుణాన్ని ఈ పుస్తకం రూపంలో తీర్చుకున్నాననీ చెప్పారు బాలగోపాల్.

వలసతత్వం, శృతిమించిన 'దేశభక్తి', సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అవలక్షణాల నుంచి మన దేశ చరిత్రను కోశాంబి రక్షించాడు అంటారాయన. కొడవటిగంటి కుటుంబరావు అన్నట్టు చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించి శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.

ఈ పుస్తకం తొలి ముద్రణ 1986లో వెలువడింది. ఆతరువాత 1992, 1995, 2000, 2009, 2012ల్లో పునర్ముద్రణ పొంది అశేష పాఠకులకు ఆకట్టుకుంది. ఇంకా ఆకట్టుకుంటూనే వుంది.
తప్పక చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good