అతనికేదో గొప్ప అనుభవం అందబోయి, చేజారి పోయి దురదృష్టం వంతుదని వెక్కిరించి నట్లుయింది. ఏంతో అందంగా రంగులు ఏరి ఓపిగ్గా కడుతున్న పూలమాలని తెంపి పువ్వులు చిందర వందర గా గిరాటు పెట్టినట్లు, అందంగా బొమ్మ గీద్దామని కాగితం తీసుకుని రంగులు కలుపు కుంటుంటే ఏదో దురదృష్ట శక్తి వచ్చి ఆ రంగుల్ని తన్నేసి  , కాగితాన్ని చించేసి వికటాట్టహాసం చేసినట్లు అనిపించింది. ? నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళబోతూ " ఎక్కడ విజయలక్ష్మి ? ఎక్కడ జయ లక్ష్మి  ? ఒక్క 'వి' లో ఎంత తేడా  ? అనుకున్నాడు. ఒక్కసారి అంటే జీవితంలో మనం ఆశించని సంఘటనలు మనకు ఎదురై మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. !
శ్రీధర్ ని  అంతలా ఆనందలోకాలకి తీసుకుపోయి మళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా పడదోసిన ఆ సంఘటన ఏమిటి ? అదేమిటో పొరపాటు కథ లో చదవాల్సిందే. ఈ సంపుటి లో దీంతో పాటు యద్దనపూడి సులోచనా రాణి రాసిన ఎనిమిది కథలున్నాయి. అవి - జ్యోతి, తోలి మజిలి, నాకీ అదృష్టం చాలు, పెళ్లి ప్రయాణం , అమూల్య , రాధ పడిన బాధ, మనసులో మాట, పొరపాటు.
ఈ కథల్లోని పాత్రాలు అన్నీ మంచిని మూసగా పెట్టుకుని మన మధ్యకు వచ్చి నిలబడతాయి. హృదయానికి హత్తుకునే యద్దనపూడి సులోచనా రాణి కథనం ఏకబిగిన చదివిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good