గొప్ప మానవతావాది, సమాజమార్పును, సమసమాజాన్ని బలంగా కాంక్షించిన ప్రగతిశీల ఆలోచనాపరుడు జస్టిస్‌ ఓ.చిన్నప్పరెడ్డి.

జస్టిస్‌ చిన్నప్పరెడ్డి గారు దేశంలోని వివిధ యూనివర్శిటీలలో, వివిధ సందర్బాలలో జరిగిన సెమినార్‌లలో న్యాయమూర్తుల, న్యాయవాదుల, న్యాయ విద్యార్థుల, మేధావులను, ప్రజలనుద్దేశించి ఇచ్చిన ఉపన్యాసాలను; వ్యాసాలను కొన్నింటిని తీసుకుని జూన్‌ 2013లో 'జస్టిస్‌ ఓ.చిన్నప్పరెడ్డి ఎ లెజెండ్‌' అను ఇంగ్లీషు పుస్తకాన్ని ప్రచురించాము. న్యాయసిద్ధాంత నిపుణులుగా పీడిత ప్రజల గుమ్మం వద్దకు న్యాయం చేరాలని పరితపించిన వ్యక్తిగా ఆయన అందరికీ చిరపరిచితులే. అంతకుమించి దోపిడి, అణచివేతలకు, అసమానతలకు అసలు కారణాల్ని విప్పి చెప్పిన మేధావిగా; మార్క్సిస్టు సిద్ధాంత తాత్త్వికతను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న ప్రజాపక్ష న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయన జీవితకాలపు విశేష కృషిని ఈ వ్యాసాలు మనముందు సాక్షాత్కరింపచేస్తాయి. మార్క్సిజం పట్ల, శాస్త్రీయ సోసలిజం పట్ల జస్టిస్‌ చిన్నప్పరెడ్డి గారికి ఉన్న బలమైన విశ్వాసం ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది.

పేజీలు :246

Write a review

Note: HTML is not translated!
Bad           Good