భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి  ప్రకాష్ కరత్ భారత విదేశాంగ విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న మార్పుల గురించి. సైనిక,వ్యూహాత్మక సంబంధాల గురించి నిశితంగా పరిశీస్తున్నారు. ఈ కార్య క్రమంలో  ఆయన  అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రాశాడు. ఇటీవల  యుపిఏ ప్రభుత్వం అమెరికాతో  కుదుర్చుకున్న అణు ఒప్పందం పెద్ద రాజకీయ దుమారాన్నే లేపింది. సంబంధిత అంశాలను వివరించడంలో వామపక్షాలు తమ వైఖరిని రూపొందించు కోవడంలో సహజంగానే ఆయన కీలక పాత్ర  వహించారు. అణు ఒప్పందంపై  తాజా వ్యాసాల సంకలనం ఇది. వీటీతో అత్యధికంగా తాజాపరచబడ్డాయి. ఎన్ డిఏ హయంలోను. తర్వాత యుపిఏ పాలనలోను భారత విదేశాంగ విధానంలో చోటుచేసుకున్న  ప్రమాదకర ధోరణులను అవగతం చేసుకోవడానికి అప్రమత్తంగా కావడానికి చక్కగా దోహద పడే గ్రంధం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good