జిడ్డు కృష్ణమూర్తితో అనుభవాలు ----                                            ‘ఆధ్యాత్మిక రంగంలో ఒకరి ఆధిపత్యం, అధికారం, పెత్తనం పనికిరావు. ప్రతిమనిషీ తనకుతానే గురువుగానూ, శిష్యుడిగానూ రూపొందాలి’ అని ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు జిడ్డు కృష్ణమూర్తి. ఆయన భావనలు చాలా పుస్తకాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పుస్తక లక్ష్యమూ అదే! అయితే, దీని భిన్నత్వం ఏమిటంటే, సీనియర్ రచయిత లక్ష్మీప్రసాద్ 1980 ప్రాంతంలో కృష్ణమూర్తిని చేసిన ఇంటర్వ్యూలు, అప్పటి అనుభవాలను కూడా మేళవించడం! ‘నా జీవితంలో జిడ్డు కృష్ణమూర్తిగారు తటస్థపడటం గొప్ప అదృష్టం’ అంటారు రచయిత. ఆ అదృష్టాన్ని ఇలా పుస్తకంగా పంచుకున్నారు. ‘మన సాధారణ చైతన్యం ఆవలనున్న ఏ మహా కరుణను వీరు దర్శించారో’ అంటూ ఇటీవలి వరకు రాసిన వ్యాసాలను కూడా జతపరిచారు. ‘కృ’ తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ సులభంగా అర్థం చేయించే పుస్తకం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good