''జీవితార్థం'' నాటకంలో ఒక సజీవశిల్పం ఉంది, వేదన ఉంది, ప్రేమ ఉంది, ఆక్రోశం ఉంది. క్షీణించిపోతున్న కుటుంబ విలువల్ని తిరిగి నిలబెట్టాలనే ఆకాంక్షతో రాస్తే సహృదయ ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఒక సినిమాని మించి, ఒక టీవీని మించి ఆంధ్ర ప్రేక్షకులు ఈ నాటకాన్ని చూసి సజల నేత్రాలతో నటీనటుల్ని అక్కున చేర్చుకున్న సన్నివేశం ఎక్కడ కానవస్తుంది. ఒక్క రంగస్థలం మీద తప్ప. ఆ అదృష్టం జీవితార్థం నాటకంది.

ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబాలు పోయి, ప్రేమ, ఆత్మీయతలు, అనుబంధాలు అన్నీ ''వ్యాపార బంధం''గా మారుచున్న ఈ కాలంలో ఈ తరంవారికి జ్ఞానోదయం ''జీవితార్థం''. ఈ నాటకం ద్వారా కొంతైనా మార్పు రాకపోతుందా? అని ఎదురు చూద్దాము. - కళ్ళం హరనాధరెడ్డి

Pages : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good