సినీ జీవన ప్రస్థానంలో ఎన్నో ఎగుళ్ళుదిగుళ్ళు దాటి, ఎన్నో భవవవైరుధ్యాలున్న వ్యక్తిగతాలను చూసి, మన్నికైన సాహిత్యాన్ని సృజించిన సముద్రాలవారి సమగ్ర సినీ సాహితీసంపదలోని చివరి భాగమిది. 1960 నుండి 1969 వరకు రచన చేసిన చిత్రాలు ఈ సంపుటంలో వున్నాయి.
సాధారణంగా రాశి ఎక్కువైతే వాసి తక్కువవుతుందంటారు. సముద్రాల విషయంలో మాత్రం రాశి, వాశి సమతూకంలో సాగాయి. వారి భాష అంతరంగాన్ని తాకే అత్తరు లాంటింది. వారి భావం అంధకారాన్ని తొలగించే లాంతరు వంటింది. ఎంతటి క్లిష్ట విషయాన్నైనా సులభంగా బోధించగలిగే 'ఆచార్యత్వం' వారిలో వుంది. అది వారి పాటలో కన్పిస్తుంది. వారి ప్రతిభా పాటవాలెలాంటివంటే, ఒకే భారతకథను ఐదారు చిత్రాలకు మాటలుగా రాసి (శ్రీ క్రిష్ణపాండవీయం, పాండవవనవాసం, వీరాభిమన్యు, శ్రీకృష్ణావతారం, నర్తనశాల) వైవిధ్యాన్ని చూపారు. ఒకే రామకథను, నాలుగైదు చిత్రాలలో (లవకుశ, భూకైలాస్‌, వాల్మీకి, శ్రీరామకథ) పాటలుగా రాసి విలక్షణత్వం ప్రదర్శించారు. ఇందెంతో అపురూపమైనది. ఏ రచయితకు దక్కని అరుదైన గౌరవం కూడా! ఇలాంటి వైశిష్ట్యం, వైరుధ్యాలతో వారి సాహితీతత్త్వం కూడుకొని వున్నది.
జీవితమే సఫలము మూడవ సంపుటము - యిప్పుడు మీ చేతుల్లో వుంది. సముద్రాల వారి కవితా సౌరభాస్వాదనక స్వాగతం పలుకుతూ...

Write a review

Note: HTML is not translated!
Bad           Good