తెలుగు సాహిత్యంలో స్త్రీవాద రచనలను సాధికారికంగా ప్రవేశపెట్టిన రచయిత ఓల్గా. కథ, కవిత, నవల, సాహిత్య విమర్శ ఆ ప్రక్రియలన్నింటిలో ఆమె చేసిన అవిరళ కృషి తెలుగునాట ఆమెకు చెరగని స్ధానాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో సమగ్ర స్త్రీవాద కవితా సంకలనం 'నీలిమేఘాలు'. తెలుగులో తొలి స్త్రీవాద సిద్ధాంత గ్రంథం 'మాకు గోడలు లేవు' ఓల్గా సంపాదకత్వంలో వచ్చాయి. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించిన పుస్తకం 'మహిళా వరణం'కు ఓల్గా సహసంపాదకులు.
సాధారణంఆ స్త్రీలకు ప్రవేశం దొరకని తెలుగు సినిమా రంగంలో ఆమె పలు సినిమాలకు కథ, మాటలు, పాటలు, సహ దర్శకత్వం అందించారు. సంకలనకర్తగా, సంపాదకురాలుగా అనేక ప్రామాణికమైన రచనలను తీసుకొని వచ్చిన ఓల్గా ప్రస్తుతం పూర్తికాలం స్త్రీవాద కార్యకర్తగా అస్మితలో పని చేస్తున్నారు.
ఒక వృద్ధనటి,
ఒక శిల్పి,
ఒక నర్తకి,
ఒక మరాఠీ రంగస్థల నటి,
సంప్రదాయ కథకళి నృత్యాన్నీ
వర్తమాన రంగస్థలాన్నీ
కలిపే ఒక అభినేత్రి,
ఒక సంప్రదాయ వర్ణ చిత్రకారిణి,
వీళ్ళు ఈ పుస్తకంలో
వాళ్ళ కథలను చెబుతారు.
కళాకారులైన ఆరుగురు స్త్రీలు
ఈ పుస్తకంలో
తమ జీవితాలలోకి కిటికిటీలను తెరుస్తారు.
వాళ్ళు తమను తాము స్త్రీలుగానూ,
కళాకారులుగానూ
ఎలా గుర్తించుకున్నారో,
కళ వారి జీవితాలలో కేంద్రమెలా అయిందో
వారి జీవితానుభవాలు తెలియజేస్తాయి.
ఈ పుస్తకంలో సమాహారమైన
వారి భిన్న అనుభవాలు
స్త్రీలుగా, కళాకారులుగా ఉండే
చరిత్రను మనకు చెబుతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good