శ్రీ జిల్లెళ్ళ బాలాజీ
తమిళం నుండి అనువాదం చేసిన
కథానికల సంకలనం ‘‘జీవనాడి’’
మానవ జీవితంలోని వైవిధ్యాలు, వైరుద్యాలు గోచరమై, చదివిన ఈ కథానికలు చిరకాలం
గుర్తుండిపోతాయి.
‘మూగ తోడేలు’ కథలో మూగ తోడేలు, విల్సన్, నల్లవాడు, తెల్లవాడు పాత్రలు ఏనుగు దంతాలు వేటాడి తెచ్చి, భార్యకు బహుమతిగా ఇవ్వటానికి ప్రయత్నిస్తున్న విల్సన్ నల్లవాణ్ణి వెంటబెట్టుకొని వేటకు అడవికి పోవటం కథాంశం.
‘వేట’ కథలో రామసాబి, తిల్లై గోయిందన్, గణేశన్ అడవికి వెళ్ళి ఈసుళ్ళు పట్టుకొని, ‘అలుగు’ను వేటాడి కాల్చుకుని, తిని, వాన మూలంగా వేట మాని తిరిగి రావటం కథేతివృత్తిం. వేట వీళ్ళకు ఊళ్ళోనే ప్రత్యక్షమయ్యింది.
ఈ రెండు కథానికలు వేటకు సంబంధించినదిగా ఉండటమే కాదు, స్త్రీ పురుషుల అక్రమ సంబంధం అతి సహజంగా చిత్రించటం కనిపిస్తుంది. తెలుగులో ఇటువంటి కథలు చాలా తక్కువే. ఇవి తెలుగు పాఠకుల్ని బాగా ఆకట్టుకుంటాయి....
పేజీలు : 176