ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

జీవనయాత్ర : చిన్నతనంలోనే తల్లిదండ్రుల మమతానురాగాలను కోల్పోయిన అభాగ్యురాలు ఆమె. తాతయ్య ఒడిలో సేదతీరి కష్టాలను మరిచిపోయేది.

వివాహబంధం జీవితంలో మలుపు కాగా సుబ్బారావుకు భార్యయై మెట్టినింట అడుగుపెట్టింది.

భర్తచే అనురాగంతో 'శాంతీ' అని పిలిపించుకొన్న ఆ చిన్నారి పదమూడేండ్ల శాంతి తన నడవడికతో ఊరంతటికి శాంతమ్మ తల్లి అయింది.

జీవితంలో తాను ఏ తల్లి మమతానురాగాలను కోల్పోయిందో వాటిని తన మరిది ఆడపడుచులకు తల్లియై పంచిపెట్టింది.

వారిరువురిని తన బిడ్డలుఆ సాకుతూ తను నలుగురు బిడ్డలకు తల్లయింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారిని బట్టి నూతన బంధుత్వాలు ఆమె బంధాలు ఏర్పడ్డాయి.

తన జీవనయాత్రలో తారసపడ్డ ప్రతి ఒక్కరికి ఆమె తల్లియై తన ప్రేమానురాగాలతో వారి జీవితాలకు వెలుగునిచ్చింది. కానీ ఆమె జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక వెలితి. కొంతకాలం ఆర్థికంగా, మరికొంతకాలం మానసికంగా.. మధ్యతరగతి సంసారంలోని సుఖదు:ఖాలకు, పాత్రల మనోభావాలకు మాదిరెడ్డి సులోచన పట్టిన దర్పణం ''జీవనయాత్ర''.

pages : 262

Write a review

Note: HTML is not translated!
Bad           Good