మనసు కదిలినపుడు ఒలికిన అక్షరాలు

ఈ తరానికి ఎలా చదవాలో తెలుసు కాని, ఏమీ చదవాలో తెలీదు. ఏమి చదవాలో చెప్పడానికి మంచి పాఠకులు అవసరం. మంచి సహృదయులు అవసరం. అక్షరాన్ని చదివి స్పందించి అక్షర సమూహంతో స్నేహం చేసే మనుషులు అవసరం. ఇదిగో, ఇలాంటి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నవారే శ్రీమతి వల్లూరుపల్లి లక్ష్మీగారు. తనకి వృత్తిని, తద్వారా భుక్తిని ఇచ్చిన గణితంతోపాటు తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను కూడా అధ్యయనం చేసి ప్రావిణ్యత సంపాదించుకుంటున్న విదుషీమణి ఈమె. కథలుగా, కవితలుగా, నవలలుగా..ఈమె పాఠకులను పలకరిస్తూనే తనని కదిలించిన పద్యాలకు అందంగానూ, హృద్యంగానూ వ్యాఖ్యానం చేస్తూ ఉండడం ఈమె ప్రత్యేకత. అలా నడుస్తూ ఉన్న ప్రయాణంలో... తను చదివిన గ్రంథాలను, చూసిన ప్రదేశాలను, గమనించిన విశేషాలను పాఠకులకు తరచుగా అందిస్తూ ఉన్న రచయిత్రి శ్రీమతి లక్ష్మిగారు. ఇలా అప్పుడప్పుడు శీర్షికలుగా, వ్యాసాలుగా, విశ్లేషణలుగా, పరిచయాలుగా వివిధ పత్రికలలో రాసిన ఆమె అవగాహనలను 'జీవనగీతం'గా ఇప్పుడు తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. - నండూరి రాజగోపాల్‌

Pages : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good