ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి.
మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అన్న సంవత్సరాల సంఖ్య కాదు ముఖ్యం !  మనం ఎంత ఆనందంగా , సుఖంగా ఈ జీవితంలో ఎంత సేపు గడిపాం అన్నదే చాలా ముఖ్యం. చిన్న వయసులో, అనుభవ లేమితో, క్రమ శిక్షణ తెలియని అజ్ఞానంతో , చాలా మంది జీవితాన్ని అడవిలో తప్పిపోయిన దోవ చేసేసుకుంటారు . కొంత మార్ద నిర్దేశకత్వం , కొంత అవగాహన వుంటే, ఆ ప్రమాదం తప్పుతుంది. రోడ్డు మీద నడవాలంటే, రోడ్డు నియమాలు ఏమిటో మనం ముందుగా తెలుసుకుంటేనే సురక్షితంగా వెళ్ళగలుగుతాం.
కాని మీ జీవితంలో ఎదురయ్యే మీ సాటివారిలో ఎవరికైనా ఇలాంటి సంఘటలను సంభవిస్తే మీరు మార్గదర్శిగా వారికి ఆలోచన, ధైర్యం చెప్పవచ్చు. ఒక్కొకసారి ఒక్క చిన్న ఆత్మీయత తో కూడిన మాట మనిషిని కొన్ని దారుణమైన అనుభవాలు నుంచి రక్షిస్తుంది. ఈ మంచి మీరు చేయగలిగిన సందర్భాలు ఒకటి రెండు ఎదురయినా శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి గారు ఈ పుస్తకం రాయడంలో గల ధ్యేయం నెరవేరినట్టే. ఒక్కొక్కసారి మనిషికి ఈ ప్రపంచంలో పుస్తకమే నేస్తం అయి దారి చూపుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good