అర్థం పర్థం లేని నిరుపయోగమైన మాటలు వేయి కంటే మనస్సుకు ఉపశమనాన్ని కలిగించే మేలైన వాక్యం ఒకటి విన్న చాలు కదా!
బొర్రా గోవర్ధన్ బౌద్ధుల దైనందిన పారాయణకు ఉద్దేశించి రచించిన ఈ చిన్న పుస్తకం మిక్కిలి శ్రేయస్సును కలిగించేదిగానే ఉన్నది. తేటతెనుగులో పాళీ గాథలను గేయరూపంలో అనువదించడం చాలా మెచ్చదగిన అంశం. వచనానికన్న గేయరూపం పఠితల హృదయాల మీద చక్కని ప్రభావాన్ని చూపుతుంది. ఎవరికి తోచిన బాణీలో వారు పాడుకొని తన్మయులు కావడానికి అనువుగా ఈ గేయములు అమరియున్నవి. ఈ గేయముల భావము కూడా సులభంగా పఠితులకు అర్థం అవుతుంది కనుక ఆ మనస్సుకు వికాసాన్ని, ప్రశాంతిని, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించి తీరుతుంది. బొర్రా గోవర్ధన్ ఇలాంటి రచనలను విరివిగా చేసి పాఠకులకు అందించగలరని ఆశిస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good