మల్లాది వెంకట కృష్ణమూర్తి డైరెక్ట్‌ నవల

అంతదాకా తనకి సన్యాసం తీసుకోవాలని వుందని ఎన్నడూ రామావతారం అనకపోవడంతోత అతని భార్యకి నవ్వొచ్చింది.

''మీరా? సన్యాసమా? అటు పుల్ల తీసి ఇటు పెట్టమన్నా పెట్డరు. ఇంట్లోలా బయట గడ్డ పెరుగు దొరకదు. మీ వల్ల కాదు'' చెప్పిందావిడ నవ్వి.

''నువ్వు సరేనను. ఎందుకు కాదో చేసి చూపిస్తాను'' నవ్వుతూ అన్నాడాయన.

''సరే-మీరు సన్యాసం తీసుకోవడానికి వప్పుకుంటున్నాను. ఏదీ సన్యసించండి చూద్ధాం'' చెప్పింది అతని చెవిలో నూనె పోస్తూ.

''ఒకసారి కాదే. మూడు సార్లు అనాలే. మూడు సార్లు ఎందుకు అనమన్నారంటే మధ్యలో మనసు మార్చుకునేందుకు అవకాశం వుంటుందని''

''సరే, మీరు సన్యసించండి, మీరు సన్యసించండి. మీరు సన్యసించండి. మూడు సార్లు అన్నాను. చాలా...ఒళ్ళంతా నూనెతో జిడ్గుఆ వుంది కాని వెంటనే నీళ్ళు తోడమనకండి. ఓ అరగంట నానాక నీళ్ళు పోస్తాను. కాగు కింద మంట ఆరనే లేదు. నీళ్ళు వేడిగా వుంటాయి.''

ఆమె మాట్లాడుతూనే వుంది. రామావతారం లేచి బయటికి నడిచాడు..

ఆ ఇల్లాలు వేరే పనుల్లో పడి భర్త సంగతి మర్చిపోయింది. రెండు గంటల తర్వాత స్నానం కోసం పిలిస్తే ఇంట్లో లేడని తెలిసింది...''

రామావతారం ఏం చేశాడు? ఆధ్యాత్మికత అంతస్సూత్రంగా సాగిపోయే నవల జయం. భగవాన్‌ రమణ మహర్షి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, శ్రీ మళయాళ స్వామి వంటివారే ఇందులో హీరోలు. ఆధ్యాత్మిక విషయాలను కథాత్మకంగా అందించే ఈ మల్లాది విలక్షణ నవల పాఠకుల మానవ జీవిత పరమార్ధాన్ని గురించి చర్చిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good