గాంధీజీ పూర్తి  పేరు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ...

మోహన్‌దాస్‌ అసలు పేరు.

కరంచంద్‌ తండ్రి పేరు.

గాంధీ ఇంటి పేరు.

''గాందీ'' అంటే 'పచారి దినుసుల వర్తకుడు' అని అర్థం. వారి పూర్వీకులు వర్తక వాణిజ్యాలు సాగించారు. కాని కొందరు వ్యాపారానికి బదులు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు.

తాత పోర్‌బందరుకు దివాను. తండ్రి పోర్‌బందర్‌, రాజకోట, వంకనేర్‌ అనే సంస్థానాలలో దివాన్‌గా పని చేశాడు.

గుజరాత్‌ రాష్ట్రంలో కధియవార్‌ ఉన్నది. దానిలో భాగం పోర్‌బందరు. అది సముద్రతీరాన ఉన్న ఒక చిన్న పట్టణం.

అక్కడే 1869 అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జన్మించాడు.

తండ్రి అసలు పేరు కరంచంద్‌. కాని కాబా గాంధీ అనే ఇంకొక పేరూ ఉన్నది. తల్లి పుతలీబాయి. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.

నాలుగవవాడు మోహన్‌దాస్‌.

తండ్రి ఎక్కువగా చదువుకోలేదు. కాని క్రమశిక్షణ, మంచి నడవడి ఉన్నవాడు. తన పదవికి న్యాయం చేకూర్చినవాడు. తల్లి భక్తి పరాయణురాలు. ఇతరులను నొప్పించేది కాదు. వారిలోని గుణాలను మోహన్‌దాస్‌ పుణికి పుచ్చుకున్నాడు....

పేజీలు : 61

Write a review

Note: HTML is not translated!
Bad           Good