గాంధీ ప్రేమించిన అంశాలు సత్యం, అహింస , జీవుల ఎడ దయ. ఆయన ఆ గుణాలనే తానూ సర్వాత్మనా నిపుకున్నాడు. తనవలెనే ఇతరులు కూడా ఉండాలని ఆశించాడు. అదే మహాత్మా గాంధీ జీవిత సాఫల్యం . మహా విజ్ఞాన వేటా ఇన్ స్టీన్ గాంధీకి సమకాలికుడే. ఆయన గాంధీని గురించి రక్తమాంసాలుగల ఇటువంటి వ్యక్తీ ఈ భూమి మీద నడిచాడని ముందు తరాలవారు నమ్మలేక పోవచ్చునని తెలిపారు. . మహాత్మాగాంధీ తో పరిచయము ఉన్న ప్రతి వ్యక్తీ ముఖ్యంగా ఆయనంటే , ఆయన భావాలంటే ఏమాత్రం సరిపోని వ్యక్తులు కూడా గాంధీ లోను అయన వ్యక్తిత్వం లోను ప్రత్యేకత ఉన్నదనే విషయాన్ని అంగీకరిస్తారు. ఒక ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ కాలం మహాత్మా గాంధీ అ దేశ పాలకుడు జెనరల్ స్మట్సు తో పోరాడాడు. అలాగే వివిధ వైస్రాయిలు , రాజ ప్రతినిధులకు విరుద్దంగా భారతదేశంలో గాంధీ మహాత్మడు పోరాడాడు. అయినా వారందరూ కూడా గాంధీలోని విశిష్టతను గుర్తించినవారే. తమతో విరోధం వహించి పోరాడిన వారిని కూడా ప్రేమించిన వాడేనని వారి అందరికీ తెలుసు. ఆయనను అతి దారుణంగా హత్య చేసిన వాడు కూడా అయన దేశీయుడే. అయన మతానికి చెందినవాడే. గాంధీ హత్యా వార్తను విన్న వెంటనే ప్రసిద్ద ఆంగ్లేయ నాటక కర్త మేధావి జార్జి బెర్నార్డు షా వంటి విఖ్యాత వ్యక్తీ కూడా "అతి మంచిగా వుండటం ఎంత ప్రమాదహేతువో ఈ డుదంతం తెలుపుతున్నది. అన్నాడు. మహాత్మా గాంధీ సంపూర్తిగా మంచితనంతో ఉండాలనుకొన్నాడు. తానూ అందరి యెడ మంచితనంతో ఉండి, ఇతరులు అందరియందు అలాగే ఉండాలని ఆశించాడు. |