ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి వున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్ఛిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి : 1. ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు 2. ఆర్‌.ఎస్‌.ఎస్‌. సైద్థాంతిక కపటత్వం 3. గొడ్డు మాంస రాజకీయం మత విద్వేష వ్యూహం 4. ఆర్‌.ఎస్‌.ఎస్‌., బిజెపి ఆధ్వర్యంలో నయా ఉదారవాద విధానాలు 5. చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలపై బిజెపి దాడి 6. రాజ్యాంగ దినం, అసహనాలపై పార్లమెంటులో చర్చ అన్న అంశాలపై 2015 నవంబరులో పార్లమెంటులో చర్చ సందర్భంగా రాజ్యసభ, లోక్‌సభల్లో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు మహమ్మద్‌ సలీంలు చేసిన ప్రసంగాలు.

Pages : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good