1919లో ఠాగూరు మదనపల్లి వచ్చాడు. అక్కడి థియోసాఫికల్‌ కళాశాల హాస్టలులో ఆయన విడిది చేశాడు.
ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ భార్య శ్రీమతి మార్గరేట్‌ కజిన్సు. ఆమెకు సంగీతం బాగా వచ్చు.
''జనగణ'' గీతానికి ఒక ''బాణీ'' కూర్చి ఠాగూరుకు వినిపించింది.
ఠాగూరుకు ఆ ''బాణీ'' నచ్చింది. మార్గరేట్‌ను మెచ్చుకున్నారు. ఇప్పుడు మనం పాడే ఫణితి (బాణీ) మార్గరేట్‌ కూర్చిందే. ఈ పాటలోని భావం తెలిసికొనుట అవసరం. జనావళి మనసులను నడిపించే ఓ భారత భాగ్యవిధాతా నీకు జయం కలుగుగాక. పంజాబు, సింధు గుజరాతు మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగ అనే ప్రదేశాలూ, వింధ్య హిమాచల పర్వతాలు, గంగా యమున నదులు ఉప్పొంగి పోతున్న సముద్ర కెరటాలూ నీ శుభ నామాన్ని తలుచుకుంటూ మేలుకొంటున్నాయి. నీ శుభ ఆశీస్సులను కోరుతున్నాయి. నీ జయ గీతాలను పాడుతున్నాయి. జనావళికి మేలుకూర్చే ఓ భారత భాగ్యవిధాతా నీకు జయము కలుగు గాక....

Write a review

Note: HTML is not translated!
Bad           Good