పాళీలో 547 జాతక కథలు లభిస్తాయి. ఆర్యశూరకవి (క్రీ.శ. 4వ శతాబ్ది) సంస్కృతంలో చంపూ కావ్య శైలిలో రచించిన జాతకమాలలో 34 కథలే ఉన్నాయి. బహుశా ఏదో ఒక విఘ్నం వాటిల్లినందువల్ల శూరకవి రచన అక్కడికి ఆగిపోయియుండవచ్చు. సంఖ్యాపరంగా స్వల్పమే అయినప్పటికి ఈ 34 కథలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సాహిత్యరత్నం అని చెప్ప దగినంత గొప్పగా ఉన్నాయి. కనుకనే అలంకార శాస్త్రకారుడు రాజశేఖరుడు తను రచించిన కావ్యమీమాంసలో ఆర్యశూరకవిని ప్రస్తావించి మిక్కిలి ప్రశంసించియున్నాడు.
ఈ జాతకమాల కథలకు సంబంధించిన చిత్రలేఖనాలు అజంతా ఎల్లోరా గుహల్లో కనిపిస్తాయి. ఈ కథలకు సంబంధిచిన శిల్పాలు బరహుత్, సాంచీ, అమరావతి స్తూపశిథిలాల్లో అభించాయి. జావాద్వీపంలోని బోరోబుధుర్ ఆలయ కుడ్యాల్లో ఈ జాతకమాల కథా సన్నివేశాలను తెలిపే శిల్పాలు చాల ఉన్నాయి.
ఈ సంక్షిప్త అనువాదంలో కథాగమనం కోసం అక్కడక్కడా స్వల్పమైన మార్పులు చేసుకొన్నప్పటికీ మూలవిధేయతను పాటించియే అనువాదం చేయబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good