'అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం, మనసే ముఖ్యం
చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై
ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును'' - ధమ్మపదం
ఆంధ్రదేశ మౌఖిక కథలు తొలుత సామాన్యముగా 'అనగనగా ఒక రాజు' అని కాని, 'అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ' అని కాని ప్రారంభమగును. అట్లే ఇందులోని చాలా కథలు వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యము చేయుచుండగా అని ప్రారంభమగును. ఈ బ్రహ్మదత్తుడు వ్యక్తియా, జాతియా అను సంశయము కలుగును. మహాభారతమును బట్టియు, మత్స్యపురాణమును బట్టియు బ్రహ్మదత్తుడను పేరు కల రాజులు నూరుగురున్నారు. ఇందలి బ్రహ్మదత్తు డొకడే యగుపక్షమున ఆయన వేలకొలది సంవత్సరములు జీవింపవలసి యుండును. ఇంతేకాక వావివరుసలు కూడా తారుమారగుచుండును. బ్రహ్మదత్తునిలో జాతివ్యక్తులు కలిసిపోయినవని విజ్ఞులు నిర్ణయించినారు. వెనుకటి జన్మములలోను, తుది జన్మములో సంబుద్ధి పొందువరకును బుద్ధుడు బోధిసత్త్వుడే. ఆయన ప్రతి జన్మలో ఏదో ఒక సుగుణములో కాని, కొన్ని సుగుణములలో కాని పారమితత్వము కాంచుచుండును. ప్రతి కథలోను ధర్మబోధ కలదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good