సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణ ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్థించే లక్షణాలు మందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమించేలా చేసి దళితుల్లో ఆత్మగౌరవ సాధనకై తపించాలని ఊహించాడు. పీడకవర్గాల ముక్కుగుద్ది హక్కుల సాధనా దిశగా సాగిన మహాప్రస్థానంలో జాషువా ఎత్తిన అనల పతాకం గబ్బిలం. ఆగామి యుగంలో దళిత సూర్యుడి శిరసు నుంచిన అగ్ని కిరీటం గబ్బిలం.

- ఏటుకూరి ప్రసాద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good