కిషన్‌చందర్ రాసిన ''జంగ్లీ'' (నవల) ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్‌చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్ నగర ''ఫుట్‌పాత్'' అలగాజన' జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్‌చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.
పేజీలు :186