ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుపతి పేరు చెబితేనే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక పులకరింత కలుగుతుంది. భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు. ఇలాంటి తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాను కూడా ఆధ్యాత్మిక జిల్లాగానే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు లేని ప్రత్యేకత చిత్తూరు జిల్లాకు ఉంది. ఈ జిల్లాలో ఉన్నన్ని ప్రసిద్ధ దేవాలయాలు తెలుగు రాష్ట్రాలలోని ఏ జిల్లాలో కూడా లేవు. తిరుపతి, తిరుమలే కాకుండా తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, నాగలాపురం, నారాయణవరం, అప్పలాయగుంట, వేణుగోపాల స్వామి గుడి ఉండే కార్వేటినగరం, తొండవాడ, తొండమనాడు, పల్లికొండ, భాతదేశంలో మొదటి ప్రాచీన శిలాయముండే గుడిమల్లం, యోగీ మల్లవరం, వాల్మీకిపురం, తరిగొండ వంటి ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలకు రోజూ వేలాది మంది భక్తులొస్తుంటారు. అదేవిధంగా తిరుపతిలోని ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణ మందిరం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ భక్తులు, యాత్రికుల సందడితో కళకళలాడుతుంటుంది. ఇన్ని పుణ్యక్షేత్రాలు కలిగిన ఈ చిత్తూరు జిల్లా భగవంతుని నామస్మరణలతో పవిత్రమైన జిల్లాగా అలరారుతోంది.
జానపదులకు అత్యంత ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడు. జానపదులు శ్రీకృష్ణుడ్ని దేవుడిగా కన్నా తమ మధ్యలో ఉండే సాధారణ పల్లీయుడిగా, స్నేహితుడిగా, తమలో ఒకడిగా భావిస్తారు. తమకున్న శృంగార భావాలన్నింటిని శ్రీకృష్ణుడికి ఆపాదించి మురిసిపోతుంటారు. ఇక జానపద స్త్రీలు తమ బిడ్డలను బాల కృష్ణుడిగా భావించుకొని లాలి, జోల పాటలను పాడ్తూ అందులో శ్రీకృష్ణుడి చిలిపి చేష్టలను ప్రస్తావిస్తూ తన్మయత్వం పొందుతారు.
జానపద గేయాలలో శ్రీ కృష్ణుడిగి గురించి తెలుసుకోవాలంటే శ్రీకృష్ణావతారం గురించి తెలుసుకోవాలి.....
పేజీలు : 186