జానకి విముక్తి (నవల) - రంగనాయకమ్మ
లోగడ ఇదే పేరుతో మూడు భాగాలుగా వచ్చిన రంగనాయకమ్మగారి రచన ఇది. దీని రచనా కాలం మొదటి భాగం 1977, రెండవ భాగం 1980లో, మూడవ భాగం 1981లోనూ పాఠకుల సౌకర్యార్థం మూడు భాగాల్నీ ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు ఈ నవలా రచయిత్రి రంగనాయకమ్మగారు.

భర్త ఎలాంటి వాడైనా భర్త తోడిదే లోకం - అని జానకికి గతంలో ఉన్న భావాలు మారడం, ఆమె స్వతంత్రంగా ఆలోచించగలగడం, భర్త పట్ల ఉన్న మానసిక బానిసత్వం నించి క్రమ క్రమంగా దూరం అవడం, అతని సహచర్యాన్ని భరించలేని స్థితికి వచ్చి అతన్ని విడిచిపెట్టడం, 'స్త్రీ బానిసత్వం' అనేదాన్ని తన వ్యక్తిగత విషయంలో కాక స్త్రీ లోకానికంతటికీ సంబంధించిన సమస్యగా అర్థం చేసుకోవడం, సమాజంలో జరగవలసిన 'విప్లవకరమైన' మార్పులకు సహకరించడమే తన జీవితాదర్శంగా ఎంచుకోవడం, ఆ రకంగా ఆమె భావాలు అంత ఉన్నత స్థాయివరకూ అభివృద్ధి చెందడం - అంత వరకూ కథ నడిచింది. అయినప్పటికీ 'జానకి విముక్తి' చెందింది అని కథలో చెప్పేయడానికి వీలులేదంటున్నారు రచయిత్రి.
విముక్తిని ఇచ్చే గమ్యంవైపు అడుగులు లేయడం ప్రారంభించడం కూడా విముక్తితో సమానమయ్యే విషయమే. గమ్యం నడక ప్రారంభమైన తరువాత, ఆ ప్రయాణం ఎంత సుదీర్ఘమైనదైనా, అది ఒకనాటికిగమ్యం చేరడం తప్పనిసరి. ఆ రకంగా జానకి విముక్తి అయింది.

స్త్రీల సమస్యలు, స్త్రీల జీవితాలకే పరిమితం కాదు. అవి పురుషుల జీవితాలకు సంబంధం లేని విషయాలు కావు. స్త్రీ  జీవితం, పురుషుడికీ జీవితం కూడా! స్త్రీకి సుఖ సంతోషాలు లేనిచోట అవి పురుషుడికి ఉండవు. స్త్రీల సమస్యల మీద స్త్రీలకు సరైన జ్ఞానం కలగడం ఎంత అవసరమో, పురుషులకు సరైన జ్ఞానం కలగడం కూడా అంతే అవసరం. స్త్రీ పురుషులకు, ఒకరితో ఒకరికి సంబంధాల్లేని వేరు వేరు జీవితాలు కావు - ఇద్దరిదీ ఒకే  జీవితం అంటూ చాలా బలంగా, సూటిగా చెప్పిన మరో మంచి నవల 'జానకి విముక్తి'

Write a review

Note: HTML is not translated!
Bad           Good