ఎందుకు వ్రాయాలి?

వేమన తనపద్యాలు చదివినవారికి మోక్షం లభ్యమవుతుందని ఎక్కడా పూచీపడలేదు. అన్నట్టు వేమన్న కవి కానేకాడని కొందరి ఉద్దేశం! కాని నేనుమాత్రం తెలుగుభాష ప్రపంచానికిచ్చిన కొద్దిమంఇ మహాకవులలో వేమన్న ఒకడని ఉద్ఘోషించక మానలేను. సమకాలిక సమాజంలోని కల్మషాన్ని అవగాహనతో, అవహేళనతో ప్రక్షాళనం చెయ్యడానికి తన కవితాశక్తిని వినియోగించినవాడు వేమన! అటువంటివాడే గురజాడ! వారిద్దరూ కొందరి మతంలో కవులే కారు ! కర్మం!

ఏదైనా సమకాలిక సమస్యను కావ్యవస్తువుగా స్వీకరించి కవనం రచిస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోవడంతోనే ఆ కావ్యం కూడా హరించుకుపోతుందని కొందరు అమాయకంగా నమ్ముతారు. అన్నిటినీ చూస్తూ నవ్వటం అలవాటైపోయిన నాకు వాళ్లని చూస్తుంటే ఏడుపొస్తుంది. - ('జనశక్తి' ద్వైవార పత్రిక, 18-11-1964)

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good