2014 మార్చి 12న జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగం

ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి, టివిలో చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రం నలుమూలలా, దేశం నలుమూలలా ఎక్కడయితే తెలుగవారున్నారో, ఈ ప్రోగ్రామ్‌ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు.

ఇప్పుడు నేనున్న పరిస్థితి వేరు. వెళ్లబోతున్న పరిస్థితి వేరు. అది ఎలా ఉందంటే ''ఇల్లేమో దూరం.. ఇల్లేమో దూరం.. అసలే చీకటి... గాడాంధకారం.. దారంతా గతుకులు... చేతిలో దీపం లేదు.. కాని... గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది... ధైర్యం ఉంది..'' ఇది నా జీవితంలో చిన్నప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కాని దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రాసిన ఈ పద్యాన్ని, ఈ పద్యంలోని పంక్తులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఎలాంఇ కష్టసాధ్యమైన పనులైన సరే గుర్తు తెచ్చుకుని.. ఇలా మీముందుకు వస్తుంటాను. ఎలాంటి దౌర్జన్యాలనయినా సరే..ఎలాంటి అవినీతిని అయినా సరే.. అరికట్టడానికి, పోరాటం చేయటానికి ఆపంక్తులనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను...

Pages : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good