సమీరా ! మా డాడీ ఎప్పుడూ చెబుతూ వుంటారు. పతిమనిసి జీవితం యవ్వనంలో జలపాతంలా ఉద్ద్రుతంగా ఉంటుంది. ఆవేగం, ఆ తొందర, ఆ ఉరుకులు పరుగులు, ఆ ప్రచండ శక్తి మనిషి శాశ్వతం అనుకోకూడదు. వయసులో ఉండగానే మనిషి సద్వర్తన , సత్యశీలత అనే ఆనకట్తతో దాన్ని బంధించాలి. లేకపోతే  వయసు గడిచిన కొద్దీ దాని వేగం తగ్గి కొండకోనల్లో రాళ్ళు రప్పల మధ్య ఒంటరితనపు అడవుల్లో నిరుపయోగం అయిపోతుంది.  ఎదుటి వారికి చెడు చేయాటం అంటే, అది తన జీవితానికే అపకారం తలపెట్టుకొంవటం అని చాలా మంది తెలుసుకోలేరు.
ఈ ప్రపంచంలో మంచి మీద మానవత్యం మీద నమ్మకం లేని వ్యక్తీ మనకి ఎదురయితే ఆ వ్యక్తి చూసి మనం భయపడాలి. ఎందుకంటే ఆ మనిషి క్రూరమృగం కంటే ఎక్కువగా తన సాటి మనిషికి, సంఘానికి హాని చేస్తాడు....
సమీర్ , అనిరుద్ద్ , శేఫాలి , తిరుమలరావ్, బాల సరస్వతి, మోహన్, భావనారాయణ - ఈ నవలలో తారసిల్లే ముఖ్య పాత్రలు. తిరుమల రావు ఇందులో దుష్టపాత్ర . పట్టుమని పదేళ్ళయినా లేనప్పుడే పక్కింటి ఆచార్యలుగారి భార్య, భర్త ఊళ్ళో లేనప్పుడు చచ్చిపోయిన ఆడపడుచు మొగుడితో మంచం మీద పడుకుని వుంటే చూస్తాడు తిరుమల రావు.
దానితో చిరుతిళ్ళకి డబ్బు లివ్వటం మొదలు పెడుతుంది. ఆచారి భార్య. అలా మొదలయిన బ్లాక్మెయిలింగ్ జీవితం తిరుమల రావు చేత ఒకదాని తర్వాత మరొకటిగా తప్పులు చేయించింది. బాల సరస్వతి తిరుమల రావు ను నమ్మి పెళ్లి చేసుకుంటుంది. కానే తిరుమల రావు దాష్టికాన్ని భరించలేక అతడి నుంచి దూరంగా వచ్చేస్తుంది. ఆమె కొడుకే అనిరుద్ద్ . ఆ తర్వాత ఆమె అయ్యంగార్ ను మరో పెళ్లి చేసుకుంటుంది. ఇలా ఎన్నో మలుపులతో సాగిపోయే నవల - 

Write a review

Note: HTML is not translated!
Bad           Good