షహీదా మాత్రమే వ్రాయగల కథలు ఈ పుస్తకం రెండో భాగంలో వున్నాయి. ప్రత్యామ్నాయ పత్రికలు చదివేవారికి తప్ప దొరకనివి. వీటికోసం తప్పకుండా ఈ పుస్తకం చదివి తీరాలి. ఉద్యమంలోని ప్రత్యక్ష అనుభవంతో అక్కడి దైనందిన జీవితాన్ని ఉద్యమ కారులు ఎదుర్కొంటునన& పరిస్థితులనూ అందులో పని చేస్తున్న స్త్రీలనూ ఆమె మనకి పరిచయం చేస్తారు ఈ కథల్లో. ఈమె కథల్లోని ఉద్యమ స్త్రీలు ఎంత సాహసవంతులో, ఎంత నిబద్ధత కలవారో అంత మృదు స్వభావులు. ప్రేమాస్పదులు. మానవతా విలువలని సహజ పరిమళాలుగా ధరించినవారు. మధ్య తరగతి భద్రజీవితంలో ఒద్దికగా ఒదిగి పోయి బ్రతుకున్న వారిని ''ఇటొకసారి'' చూడండి అని నిలేస్తారు. - పి.సత్యవతి

ఈ కథల నిండా మనిషి పరిమళం - అది త్యాగానికి, సమిష్టి జీవన సౌందర్యానికి సంబంధించిన పరిమళం. అది స్వంత ఆస్థిలో ముక్కచెక్కలై కుళ్లిపోయినది కాదు. అది ఆకాశమంత, నేలంత, గాలంత, కన్నీళ్లంత స్వచ్ఛమైన మనిషి పరిమళం...

ఈ పరిమళంలోకి మనుషులందరిని ఆహ్వానిస్తూ. - అల్లం రాజయ్య

పేజీలు 392

Write a review

Note: HTML is not translated!
Bad           Good